Home  »  TV News  »  Podharillu : పెద్ది అని ఎందుకు పిలుస్తుందో కారణం చెప్పిన మహా!

Updated : Feb 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -49 లో...మాధవని మహా రూమ్ చూడమని అడుగుతుంది. సరే అమ్మ చూస్తాను.. నీకు సౌకర్యంగా ఉన్న రూమ్ చూస్తానని మాధవ చెప్తాడు. మహా వెళ్ళిపోయాక అన్నయ్య నువ్వు తనకి రూమ్ చూడకు అని చక్రి చెప్తాడు. ఎందుకని మాధవ అడుగుతాడు. ఎందుకంటే మేం ఇద్దరం ఒక దగ్గర ఉంటేనే కదా ప్రేమ పుట్టేది అని చక్రి అంటాడు. అన్ని నేను అనుకోకుండా జరిగినవే అని చక్రి అంటాడు. ఆ అమ్మాయికి నువ్వు ఇష్టం లేదు.. ఏదో సాయం చేసావని అనుకుటుంది కానీ ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు.. ఈ విషయం ఆ అమ్మాయికి తెలిస్తే నీకు విలువ ఉండదని మాధవ అంటాడు.

ఆ తర్వాత మహా గదిలోకి వెళ్తుంది. డోర్ కి గడియ లేకపోవడంతో మహా ఇబ్బంది పడడం మాధవ చూసి చక్రికి చెప్పి సెట్ చెయ్యమంటాడు. చక్రి గడియ సెట్ చేసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మహా లేచి బయటకు వెళ్తుంది. అప్పుడే నారాయణని కానిస్టేబుల్ ఇంటిదగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైంది నాన్న లేట్ గా వచ్చావని మాధవ అడుగుతాడు. ఎక్కువ సేపు పడుకున్నాను.. లేచేసరికి లేట్ అయిందని నారాయణ చెప్తాడు.

ఆ తర్వాత మాధవ కిచెన్ లో వంట చేస్తుంటే మహా వెళ్తుంది. మాధవని మహా పెద్ది అని పిలుస్తుంది. ఎందుకు అలా పిలవాలని అనిపించింది అని మాధవ అడుగుతాడు. మా మావయ్యని అలాగే పిలిచే దాన్ని నన్ను బాగా చూసుకునేవాడు కానీ ఆయన లేడు ఇప్పుడు.. మీరు నన్ను ఇలా చూసుకుంటుంటే అలాగే అనిపించింది అందుకే అని మహా చెప్తుంది. మీరు ఇంత కష్టపడుతున్నారు.. చక్రిని లేపుతానని మహా వాటర్ తీసుకొని వెళ్తుంది. స్లిప్ అయి ఆ వాటర్ కేశవపై పడుతుంది. కన్నా, చక్రి అనుకొని కేశవ కోపంగా లేస్తాడు. దాంతో మహా బయపడి లోపలికి వెళ్తుంది. ఎంట్రా వదినపై అలాగేనా అరిచేది అని మాధవ అడుగుతాడు. చక్రి, కేశవ గొడవపడతారు. మహా దగ్గరికి చక్రి వచ్చి నచ్చజెప్పుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.